నాకు కుల పిచ్చి ఉంటే.. 

టీడీపీకి సపోర్ట్‌ చేసేవాడినే కాదు
– నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
– విశాఖలోని టీడీపీ నేతలు డాల్ఫిన్‌ కొండలను కూడా మింగేసేలా ఉన్నారు
– తెదేపా ఎమ్మెల్యేలంటే దిగొచ్చారా?
– చొక్కాలుపట్టుకొని రోడ్లపైకి లాగుతాం
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
విశాఖపట్టణం, జులై5(జ‌నం సాక్షి) : నాకుపై కులముద్ర వేసే ప్రయత్నం కొందరు పనిగట్టుకొని చేస్తున్నారని, నాకే కుల పిచ్చి ఉంటే టీడీపీకి సపోర్ట్‌ చేసేవాడినే కాదని జనసేన అధినే తపవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం విశాఖలో జనసైనికులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో నేను చంద్రబాబు దగ్గరకు వెళ్లి విూ పార్టీకి సపోర్ట్‌ చేస్తానని అడగలేదని, ఆయనే నా దగ్గరకు వచ్చి మద్దతు ఇవ్వాలని అడిగారన్నారు.  చంద్రబాబు నా దగ్గరకి వచ్చి నీకు ఏం కావాలని అడిగారని… ప్రజలకు మంచి చేయమని ఒకే కోరిక ఆయను కోరానని వెల్లడించారు. విశాఖ నాకు చాలా ముఖ్యమైనదని ఈ సందర్భంగా
పవన్‌ పేర్కొన్నారు. నన్ను విూ ముందు నిలబెట్టింది విశాఖనే అని, ఆరోజు కామన్‌ మాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టినప్పుడు నన్ను అర్ధం చేసుకుంది కేవలం జనసైనికులే అన్నారు. నేను పార్టీ పెట్టినప్పుడే కులం, ప్రాంతాలను అంటకట్టబోయారని, కాళ్ళు విరగ్గొడతానని హెచ్చరిస్తే వెనక్కి తగ్గారని చెప్పారు. విూరు పార్టీ పెడితే కులం రాదా… నేను పెడితే వస్తాదా…? అంటూ ప్రశ్నించిన పవన్‌… ఎమ్మెల్యేలు, వారి కొడుకులు జాగ్రత్తగా ఉండాలిని, నాకు కులం అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. టిడిపికి సపోర్ట్‌ చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదా…? నాకు కుల పిచ్చి ఉంటే విూకు సపోర్ట్‌ చేయకపోయేవాడిని కదా అన్నారు. విశాఖలోని టిడిపి నేతలు డాల్ఫిన్‌ కొండలను కూడా మింగేసేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఎమ్మెల్యే లు అంటే దిగి వచ్చారా…?చొక్కా పట్టుకుని రోడ్డు పైకి లాగుతాను అని హెచ్చరించిన పవన్‌… ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి అని పవన్‌ ఘాటుగా హెచ్చరించారు.