నాన్యత ప్రమాణాలు లేని మిషన్ కాకతీయ పనులు..

*అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో
*వర్ష కాలానికి ముందు*నత్తనడకన పనులు
వీర్నపల్లి మే26(జనంసాక్షీ):-
వీర్నపల్లీ మండలకేంద్రంలో  ప్రభుత్వం పరంగా గుర్తింపు పోందిన చెరువులు కుంటలు రెండే రెండు 1 వెంకరాయిని చెరువు2 పులిచెరువుకుంట.
వెంకటరాయిని చెరువు మరమ్మతులు చేయుటకు గతసంవత్సరంలో తెలంగాణప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న మిషనకాకతీయ పథకం ద్వారా 56 లక్షల రూపాయల నిధులు చేరువు మరమత్తూ పనుల  నిమిత్తం మంజూరు చేయడం జరిగింది. ఇట్టి నిధులతో పనులు చేసినప్పటికి అదికారుల ,కంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండపొయింది .
తిరిగి ఈ సంవత్సరం మళ్ళి మిషన్ కాకతీయపథకం లోనే ప్రస్తుతం 46 లక్షల రూపాయలతో మళ్ళి పనులను ప్రారంభించడం జరిగింది. పనులు టెండర్ అయిన కాలం నుండి ఇప్పటికి పనులు పూర్తి కావల్సి పోయి ప్రస్తుతం 20 రోజులక్రితం ప్రారంభించారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వర్ష కాలానికి నెలముందు పనులు మొదలు  పెట్టారు పోయినసంవత్సరం తూమువెనుకాల కట్టను చీల్చి పోతమట్టిపోసి కనీస నాణ్యత ప్రమాణాలు పాటించక  అరకోర పనులు చెసి డబ్బులు తిసేసుకున్నారు.నాయకులఅదికారులచిత్తుతుద్ధి లేనందు వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని స్థానికులవాదన.ప్రస్తుతం కూడా వర్షకాలం ముందే పనులను ప్రారంభించారు.
తూము చుట్టూ జేసిబిలతోపనులుప్రారంభించారు.
వర్షకాలం సమీపిస్తున్న సమయంలో  ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిదులు, మండల కేంద్రంలోని నాయకులు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను పర్యవేక్షీంచి సరైన నాణ్యత ప్రమాణాలతో మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గతసంవత్సరం పులిచెరుకుంటపనులకు
9లక్షలరూపాయల మిషనకాకతీయ
నిధులతో కుంటమరమ్మత్తులు చెపట్టారు.ఇట్టీ పనులతో భాగంగా చెరువులో పూడీకతీత, కట్ట సైడుకు క్రిందభాగం లోపలతవ్వి నల్లమట్టి తోక్కించడం జరిగింది.కట్టను పెంచక మత్తడిని మరమ్మత్తు చేయక ,పైపైన పూతలు  చేసి కుంటలో తీసిన మట్టిని కూడా అమ్మకున్నారు. వచ్చిన డబ్బు లలో సగం డబ్బులు కూడా ఖర్చు చేయ్యక పనులు ముగించుకున్నారు.
ఇదేంమిటి అంటే అంతా మా ఇష్టం అంతా మేమే, మేము చేసేదేపని,బిల్లు వచ్చేసింది, ఏం అయినపర్వాలేదు అనేవిదంగా ఉన్నారు కాంట్రాక్టర్లు,పనులు చేయించేవారు.ఇట్టి పనులకు సంబంధించి అధికారలది కూడా నిర్లక్ష్యదోరిణే పనులు జరిగే సమయంలో పరవేక్షించేనాదుడే ఉండరు. కావున అధికారులు నాయకులు త్వరగా మేలకోని వర్షా కాలం కంటే ముందే పనులు పూర్తి చేసి నీరు ఆగేవిదంగా కట్టను కట్టాలని  మండల కేంద్రం లో ని అన్నదాతలు కోరుతున్నారు.
బి జే పి మండల అధ్యక్షుడు యం మల్లేశం
నాన్యత ప్రమాణాలు లేవు గత సంవత్సరం మాదిరిగానే పనులు జరుగుతున్నాయి. నత్తనడకన కాకుండా త్వరితగతిన పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది.
తండా నాయుడు జి లింగంమూర్తినాయక్
పులిచేరువు కుంట మిషన్ కాకతీయ ద్వారా పనులు సక్రమంగా జరుగలేదు నాన్యత ప్రమాణాలు మచ్చకైన లేవు.తూము సరిగ్గా కట్టలేదు.