ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేసిన నేతలు
తెలంగాణలో బిజెపిదే అధికారం అన్న దత్తన్న
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ అయింది. తొలి రోజే పలువురు భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముషీరాబాద్ అభ్యర్థిగా లక్ష్మణ్ నామినేషన్‌వేశారు. కేంద్రమంత్రి హన్ష్‌రాజ్ తాహిర్, ఎంపీ దత్తాత్రేయ, కిషన్ రెడ్డి,మురళీధర్ రావులతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని విజయగణపతి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ర్యాలీ పొడవునా బ ఇజెపి కార్యకర్తల నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణలో 70కి పైగా సీట్లతో బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని ఎంపీ అన్నారు.తెరాస అసమర్థ పాలనను శ్రేణులు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, మహాకూటమిని ఓడించి తెలంగాణలో భాజపాకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ నాయకులదేనన్నారు
ఇకపోతే గోషామహల్ భాజపా అభ్యర్థి రాజాసింగ్ ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థిగా
గంగిడి మనోహర్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వరంగల్ గ్రావిూణ జిల్లా పరకాలలో భాజపా అభ్యర్థి విజయ చందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.




