తిరుపతి,నవంబర్12(జనంసాక్షి): ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్ నందగోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన తిరుపతి కోర్టు నందగోపాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. బాలికలను లైంగికంగా వేధించాడని నందగోపాల్‌పై ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు.




