హైదరాబాద్: శాసన సభ్యులల కోటా ఎమ్యెల్సీ ఎన్నికల నామినేషన్లకు దాఖలుకు గడువు ముగిసింది. ఆరో అభ్యర్ధి రంగంలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవ మైంది. చివరి నిమిషం వరకూ ఆరో అభ్యర్ధి విఫయంలో ఉత్కంఠ నేలకొంది. ఆరో అభ్యర్ధి విషయం ఏటూ తేలకముందే గడువు ముగిసింది. దాంతో బరితో ఉన్న వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి,షబ్బీర్ అలీ, కోలగట్ల సంతోష్, లక్ష్మీశివకుమారి, తేదేపానుంచి యనమల రామకృష్ణుడు, శమంతకమణి,మహ్మద్ సలీం, తెరాస నుంచి మహ్మద్ అలీచ, వైకాపా నుంచి అదిరెడ్డి అప్పారావుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది.




