Tuesday, 3 November 2026

నాయకత్వపు మార్పు దిశగా చైనా ?

 

చైనా : కొత్త సైనికాధిపతిగా జి జింగ్పింగ్‌ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనికా ధిపతి నుంచి తప్పుకునేందుకు దేశాధ్యక్షుడు హూజింటావో నిర్ణయించుకో వడంతో ఆయన తెలిపారు. కేవలం దేశ ఆర్మీ చీఫ్‌గా మాత్రమే కాకుండా అన్ని పదవుల నుంచి వైదొలగేందుకు జింటావో నిర్ణయించుకున్నారు. దీంతో చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషను ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న 59 ఏళ్ల జింగ్‌పింగ్‌ సైనికాధినేత కాబోతున్నారు. అలాగే అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం జరుగుతున్న 18వ కమ్యూనిస్టు పార్టీ సమావేశాల చివరి రోజైన నవంబర్‌ 14వ జింగ్‌పింగ్‌ లాంఛనప్రాయంగా ఎన్నికవనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *