గరీబ్ నగర్ అమీర్ నగర్ కావాలి
సీఎం కేసీఆర్ ఆకాంక్ష
వరంగల్,జనవరి10(జనంసాక్షి): నాలుగు నెలల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, అలాగే పేదలందరికీ పింఛను, రేషన్‌కార్డులు తప్పకుండా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని హావిూ ఇచ్చారు. వరంగల్ నగరంలో కేసీఆర్ మూడో రోజు పర్యటనలో భగంగా గరీబ్‌నగర్‌లో సీఎం స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. గరీబ్‌నగర్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే ఇక్కడికి వచ్చానని చెప్పారు. గరీబ్‌నగర్ పేరు తీసి కాలనీకి అవిూర్‌నగర్ అని పెట్టుకుందామని అన్నారు. అందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. గరీబ్‌నగర్‌లో కబ్జాలో ఉన్న అందరి స్థలాలు క్రమబద్ధీకరిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి అన్ని వసతులు కల్పిస్తాని అన్నారు. ఎంపి శ్రీహరి, మంత్రులు రాజయ్య తదితరులు ఇక్కడే ఉండి అందరి పేర్లు నోట్ చేసుకుంటారని చెప్పారు. విూ దగ్గరికే అధికారులు వస్తారని, అన్ని వివరాలు సేకరిస్తారని చెప్పారు.ఇక్కడ ఒక్కరు కూడా ధనవంతులు లేరని వ్యాఖ్యానించారు. ఇకపై గరీబ్‌నగర్‌ను అవిూర్‌నగర్‌గా పిలుచుకుందామన్నారు. అందరూ ఇళ్లు ఉన్నవాళ్లు కావాలని ఆకాంక్షించారు. కాలనీలోని అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, రేషన్‌కార్డులు అందజేస్తామని హావిూ ఇచ్చారు. అధికారులు ఇళ్ల సర్వే కోసం వచ్చినపుడు రేషన్‌కార్డులు లేనివారు వారి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. కాలనీ నిర్మాణం సరిగా జరగలేదని, అధికారులు కాలనీ రూపు రేఖలు మార్చుతారని సీఎం తెలిపారు. ఇది ఒకప్పుడు మల్లికుంట చెరువని చెరువులోనే కాలనీ నిర్మించారని వివరించారు. సర్వే కోసం వచ్చేటపుడు కలెక్టర్ ప్రకటన చేస్తారని ఆరోజు అందరూ ఇండ్లల్లో ఉండి పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ప్లాన్ ప్రకారం లేని ఇండ్లను అధికారులు తొలగించి వేరేచోట ఇండ్లను కేటాయిస్తారని స్పష్టం చేశారు. గరీబ్‌నగర్‌వాసులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… ఈ కాలనీలో పేదలంతా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇండ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ఈ భూములన్నింటిని పేదలకు రిజిస్టేష్రన్ చేయించి ఇస్తామన్నారు. అంతేకాదు పేదలకు పక్కా ఇండ్లను నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు. ప్రతీ ఇంటిలో మంచినీటి నల్లాలను పెట్టిస్తామని తెలిపారు. కాలనీలో ఏ ఒక్క మహిళ మంచినీటి కోసం రోడ్డుపైకి రాకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళ మంచినీటి కోసం రోడ్డుపై కనిపిస్తే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుందని చమత్కార దోరణిలో హెచ్చరించారు. సీఎం వస్తే సమస్యలు భయపడి పారిపోవాలన్నారు. అలాగే కాలనీని తానే ప్రారంభిస్తానని అన్నారు. తనకు దావత్ ఇవ్వాలన్నారు. ఇస్తారు కదా అంటూ వారిని పలకరించారు. గుడంబా తీసుకుని రావద్దని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కడియం శ్రీహరి, మంత్రి రాజయ్య, ఎమ్మెల్యేలు సురేఖ తదితరులు పాల్గొన్నారు.





