Tuesday, 3 November 2026

రాంలీల మైదానంలో ఎన్నికల శంఖారావం

1

కేజ్రీవాల్‌ లక్ష్యంగా ప్రచారం

భాజాపాను గెలిపించండి – మోదీ

న్యూఢిల్లీ,జనవరి10(ఆర్‌ఎన్‌ఎ): ప్రజల ప్రేమ, అభిమానంతో భాజపా 2014 నుంచి విజయ పరంపర కొనసాగిస్తోందన్నారు.  ఇప్పటికీ బీజేపీ పట్ల ప్రజలకు ప్రేమ, విశ్వాసం ఉందన్నారు. ప్రజల ప్రేమ, విశ్వాసంతో విజయాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ సహా అన్ని రాష్టాల్ల్రో  తమపై భరోసా ఉంచారు.. గెలిపించారు. జమ్మూకశ్మీర్‌ లోనూ బీజేపీకి ప్రజలు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. ఇక ఢిల్లీలో కూడా బీజేపీకి బ్రహ్మరథం కట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడి రాంలీల మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇటీవలి ఎన్నికల వరకు అది కనిపిస్తూనే ఉందని అన్నారు. ఢిల్లీలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్‌ రాష్టాల్ల్రో ప్రజలు తమపై భరోసా ఉంచి ఎన్నికల్లో విజయాన్ని అందించారని అన్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు కూడా భాజపాకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా రష్టాల్ర సిఎంలను, నాయకులను వేదికపైనుంచి అభినందించారు. భాజపాను విశ్వసించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ సహా దిల్లీలోని గల్లీ సమస్యలు తెలిసిన నేత వెంకయ్యనాయుడని అన్ని ప్రాంతాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. ఆయనకు ఉన్న అవగాహన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని వ్యాఖ్యానించారు. దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటోందని వారి కలల సాకారానికి కృషి చేస్తానని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాము కుల, మత, ప్రాంత, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, కేవలం అభివృద్ధి రాజకీయాలే తమ అజెండా అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో బ్యాంకుల వద్ద ప్రజలను ఏనాడైనా చూశామా? అని ప్రశ్నించారు. బ్యాంక్‌ గడప తొక్కని పేదలకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిపించామని, వారికి లక్ష వరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించామని అన్నారు. ఒక్క ఢిల్లీలోనే ఇలా 25 లక్షల పైచిలుకు ఖాతాలు తెరిచారని అన్నారు. ఇది పేదలకు బ్యాంక్‌ సేవలను అందించే లక్ష్యంతీ తీసుకున్న నిర్ణయమన్నారు. అలాగే ఢిల్లీలో విద్యుత్‌ కోతలపైనా దృష్టి పెట్టామని అన్నారు. ఇక్కడ నిరంతర విద్యుత సరఫరా తమ లక్ష్యమన్నారు. ఇందుకు జనరేటర్ల మోత లేకుండా ఢిల్లీకి విముక్తి కలిగిస్తామని అన్నారు.  కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య అని మోదీ కొనియాడారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, ఢిల్లీ సహా గల్లీ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య నాయుడు అని పేర్కొన్నారు. ఢిల్లీ సమస్యలపై ఆయన చెబుఉతంటే గత దశాబ్ద కాలంగా ప్రజలు ఎంతగా నీరసించి పోయారో అర్థం అవుతుందన్నారు. వీరి సమస్యలు పరిష్కరించే బాధ్యతలను తాము తీసుకుంటామని అన్నారు. దేశ యువత బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ లలో బీజేపీ ప్రజల పట్టం కట్టారన్నారు. పేదరిక నిర్మూలనలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

బిజెపి వాగ్దానాలను నెరవేరుస్తుంది. బీజేపీకి 2014 విజయనామ సంవత్సరమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార సభ ప్రారంభం సందర్భంగా రాంలీలా మైదానంలో షా ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ తరపున ముగ్గురు సీఎంలు అయ్యారు అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ లో బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా సీట్లను గెలుచుకుందని చెప్పారు. ఢిల్లీలో కూడా బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేకిన్‌ ఇండియాతో దేశంలో నిరుద్యోగాన్ని పారదోలతామని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో నైపుణ్యాభివృద్ధి పెరగాలి.. అందుకోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నల్ల కుబేరుల జాబితా బయటపెట్టామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భాజపాకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత భాజపా తరపున ముగ్గురు సీఎంలు అయ్యారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *