Monday, 2 November 2026

నాలుగేళ్లలో గిడ్డంగుల సామర్థ్యం 

రెట్టింపు చేసుకున్నం
– దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం
– ఉద్యోగ నియామకాలపై సీఎంతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తాం
– దళారుల కోసం కాదు.. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం మనది
– రాష్ట్ర గిడ్డంగుల సవిూక్ష సమావేశంలో మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి): నాలుగేళ్ల కాలంలోనే మన గిడ్డంగుల సామర్థ్యం రెట్టింపు చేసుకున్నమని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. నగరంలోని లక్డీకపూల్‌లో రాష్ట్ర గిడ్డంగులపైన సవిూక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌ రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ మందుల సామెల్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సవిూక్షలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ముందుగా 100శాతం ఆక్యుపెన్సీ సాధించినందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం సాధించిందంటే అది కేవలం సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమైందన్నారు. నాలుగు ఏండ్ల కాలంలోనే మన గిడ్డంగుల సామర్థ్యం రెట్టింపుకు చేరిందని, గతంలో 86 శాతం ఉపయోగించే వాళ్లమని, కాని.. ఇప్పుడు 100 శాతం నిల్వ సామర్థ్యం పెంచుకున్నామని తెలిపారు. దళారుల కోసం కాకుండా రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వం మనదని హరీష్‌రావు తెలిపారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్‌లు నిండిన తర్వాతనే ప్రైవేట్‌ గిడ్డంగులలో నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా నిర్మించిన గిడ్డంగులలో అదనపు ఆదాయం సమకూర్చుకున్నామని తెలిపారు. అందరు ఉద్యోగుల కృషితో మనం ముందుకు పోతున్నామని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని హరీష్‌రావు సూచించారు. దేశంలో మొదటి స్థానంలో ఉన్నామని, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కూడా మనమే నెంబర్‌ వన్‌గా నిలిచామన్నారు. దీని ద్వారా మనపై ఇంకా బాధ్యత పెరుగుతుందని హరీష్‌రావు అన్నారు. గిడ్డంగుల సంస్థకు ప్రభుత్వం తరుపున సహాయసహకారాలు అందిస్తామని, ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని హరీష్‌రావు ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగ నియామకాల కోసం సీఎంతో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యను పరిస్కరిస్తానని మంత్రి తెలిపారు.  అనంతరం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ మందుల సామెల్‌ మాట్లాడుతూ.. విూ మంత్రి వర్గంలో నేను చైర్మన్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నానని, విూతోపాటు ఉద్యమంలో పని చేశానని, అదేతరహాలో ఇప్పుడు పని చేస్తున్నా అన్నారు. విూరు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో నేను, మా సహ
ఉద్యోగులు పని చేసి దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉందని, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఇచ్చి సాగునీరు అందించడంతో మన గోడౌన్‌లలో నిల్వలు పెరిగాయన్నారు. వాటికి అనుగుణంగా మన సంస్థ గోడౌన్‌లను నిర్మించి రైతాంగానికి మేలు చేసిందని, అయితే.. మా గిడ్డంగుల సంస్థలో ఉద్యోగుల కొరత ఉందన్నారు. ఉద్యోగుల భర్తీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. 270 గోడౌన్స్‌ తీసుకొని అన్ని రకాల విత్తనాలు నిల్వ ఉంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నామని తెలిపారు. ఈ సవిూక్షలో డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ అధికారులు పాల్గొన్నారు.