Monday, 2 November 2026

నాలుగేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల యువకుడు అఘాయిత్యం…

చిత్తూరు: అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన శీనయ్య(25) అనే యువకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు విన్న కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యేసరికి అతను అక్కడి నుంచి జారుకున్నాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *