Thursday, 5 November 2026

నిడదవోలు మండలంలో మొదలైన జగన్‌ పాదయాత్ర

ఏలూరు,జూన్‌9(జనం సాక్షి ): వైసీపీ అధినేత జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం నిడదవోలు మండలం మునిపల్లి నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, డి.ముప్పవరం విూదుగా సమిశ్రగూడెం వరకు పాదయాత్ర సాగనుంది. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి సమిశ్ర గూడెం విూదుగా నిడదవోలు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. కోర్టుకు హాజరయ్యేందుకు శుక్రవరాం యాత్రకు విరమం ప్రకటించారు.