బాలుడిపై మహిళ అత్యాచారం

ఫిర్యాదుతో పోలీస్‌ కేసు నమోదు

విజయవాడ,జూన్‌9(జనం సాక్షి ): వినడానికి కొంచెం రివర్స్‌లగా అనిపించినా ఓ మహిళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. విజయవాడలో 14 ఏళ్ల బాలుడిపై మహిళ అత్యాచారానికి యత్నించింది. బాలుడి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో మహిళపై దాడికి దిగారు. బాలుడుతల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళపై పోలీసులు ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాలుడిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.