Tuesday, 3 November 2026

నిబంధనలు పాటించని బస్సులపై పోలీసుల కొరఢా 

– శంషాబాద్‌లో 15 స్కూల్‌ బస్సులపై కేసు
శంషాబాద్‌, జూన్‌28(జ‌నం సాక్షి) : నిబంధనలకు విరుద్దంగా విద్యార్థులను తరలిస్తున్న స్కూల్‌ బస్సులపై ట్రాఫిక్‌ పోలీసులు కొరఢా ఝుళిపించారు. ఈ తనిఖీల్లో 15 బస్సులు సీజ్‌ చేసి ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్కూల్‌ బస్సులపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. గురువారం ఉదయం శంషాబాద్‌లో స్కూల్‌ బస్సులను ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నిబంధనలు పాటించిన 15 స్కూలు బస్సులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులను తరలిస్తున్న మూడు ఆటోలపైనా పోలీసులు కేసులు నమోదు చేసి ఒక ఆటోను సీజ్‌ చేశారు.