నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి :
జాగృతి అభ్యుదయ వ్యవస్థాపక అధ్యక్షులు భావన శ్రీనివాస్
ఎల్బీనగర్ (జనం సాక్షి) నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జాగృతి అభ్యుదయ వ్యవస్థాపక అధ్యక్షులు భావన శ్రీనివాస్ అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘము నిర్వహిస్తున్న, ప్రతిపాదించిన, విన్నవించిన పలు కార్యక్రమాల గురించి మన గౌ.శాసన సభ్యులవారితో చర్చించేందుకు సోమవారం నాడు వారి కార్యాలయం వద్దకు జాగృతి ప్రతినిధులు భావన శ్రీనివాస్, గోపాల్ దాస్ రాములు వెళ్ళి కలవగా…తగిన సమయం సరిపోక మీ వాహనంలోనే వెళ్తూ మాట్లాడుకుందామంటూ గౌ.సుధీర్ రెడ్డి ఎటువంటి సంకోచం, ఆడంబరం లేకుండా మా మొదటి ముద్ద వాహనంలో వారి కార్యాలయం నుండి హస్తినాపురం వరకు ప్రయాణించి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనారు.
ఇంత గొప్ప మనస్తత్వంతో ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూన్న మన సు’ధీరుడు’ నిజంగా పలువురు రాజకీయ నాయకులకు స్పూర్తి ప్రదాతనేవారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని కొందరు రాజకీయ వేత్తలను వేడుకున్నారు.