నిర్మల్(జనం సాక్షి ): జిల్లాలో దారుణం జరిగింది. సొన్ మండలం పాత కూచనపల్లి శివారులో 10ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. శనివారం ఇంటి నుంచి బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు బాలిక కోసం వెతికారు. పాత కూచనపల్లి శివారులో బాలిక విగతజీవిగా పడివుంది. నిర్జీవంగా పడివున్న బాలికను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషాదం నుంచి తేరుకున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదులో ప్రవీణ్ అనే అనుమానితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
నిర్మల్ జిల్లాలో దారుణం




