నిర్మాణ అంచనాల సవరణకు సమావేశం ఏర్పాటు చేయండి

కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ
అమరావతి, జూన్‌21(జ‌నం సాక్షి) : కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసిన నిధుల్లో రూ. 1400 కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఏపీకి జీవనాడి అని చెప్పారు. ప్రాజెక్ట్‌ ఖర్చులు పెరిగినందున నిర్మాణ అంచనాలను సవరించాలని, నిర్మాణ అంచనాల సవరణకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని లేఖ ద్వారా తెలిపారు.