ఢిల్లీ; అత్యాచారానికి గురైన చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇన్ ఫెక్షన్ సోకకుండా సెలైన్ల ద్వారా చిన్నారికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు.చిన్నారి వైద్యానికి స్పందిస్తుందని,ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ పాప తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది వైద్యబృందం పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యుడు గుప్తా వెల్లడించారు.
కాగా నిందితుడు మనోజ్ చిన్నారిని 40 గంటల పాటు నిర్భందించినట్లు డీసీపీ ప్రభాకర్ తెలిపారు. నిందితుడిని బీహార్‌లోని అతని అత్త గారింట్లో అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసినట్లు డీసీపీ పేర్కొన్కారు.




