నిల్వబియ్యం నాణ్యత పరిశీలించండి
అధికారులకుమంత్రి గంగుల ఆదేశాలు
హైదరాబాద్,జూలై(జనంసాక్షి): తెలంగాణలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు విద్యాలయాలకు అందిస్తున్న బియ్యంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ధిష్ట ఆదేశాలు జారీచేసారు. విద్యాలయాలు, గురుకులాలు ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో గత మూడు నెలలుగా నిల్వ ఉన్న బియ్యం(సతిఞ।) నాణ్యతను సివిల్ సప్లైస్ జేసీ, డీఎం, విద్యాశాఖకు చెందిన ఎంఈవోలు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలతో కలిసి పరీక్షించాలని ఆదేశించారు, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న విద్యాలయాల్లో ఈ తనిఖీలు చేపట్టాలన్నారు, ఎక్కడైనా బియ్యం నాణ్యత సరిగా లేకపోతే వెంటనే వాటిని పాతబియ్యంతో మార్చి వేయాలని ఆదేశించారు. ఈ విధుల్లో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.