హైదరాబాద్ : (సచీవాలయం) : నీలం తుఫాను ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 77 వేల హెక్టార్లలో పంట నీట మునీగిందని. పంటనష్టం అంచనాపై నివేదిక పంపమని కలెక్టర్లను అదేశించినట్లు అయన తెలిపారు.నీలం తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతిచెందారు. 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో మొత్తం 8 చెరువులకు గండ్లు పడినట్లు అయన పేర్కోన్నారు.




