మేఘమా మరువకే, వర్షించవే హర్షించే హసన్ పర్తిలోనా,
జేష్ట మాస వేళలో, జంకు ఎందుకు జల్లులు కురిపించవా! నీటి పూల మాలగా నీలి మేఘాలతో కూడి మెల్లగా.. మెల్లగా మరలి రావే చల్లగా… మృదు మధురంగా చల్లని చిరుగాలులతో మదిలోమెదిలే వర్షపు నీటి బిందువై..
ఎండ కాచిన భూదేవి నీటి దారులను .. రారా రమ్మంటుంటే..!
కురులు విప్పిన ఎర్రగట్టు కొండలు.. చింతగట్టు కోనల్లో వర్షపు వరదలు అలకలు సాగిస్తుంటే హసన్ పర్తి ఊర చెరువు నిండే ఎరగని రేయిలో.. తొలి హాయిలో అలివేణి
విష్ణువుకే తెలియని అందము.. అందించేను నెలరాజా
కలలా.. అలలా.. మెరిసి.. గర్జించే గడుసు మేఘమా
వర్షపు ముసురుకు మరుగే ఎరుగని మునిపల్లి కోనలో నెమలి.. పరుపు విరుపులై గిచ్చే సందడిలోన
తడవ తడవకి పెరుగుతున్నది.. హసన్ పర్తి ఊర చెరువు నీటి మట్టం,
నలిగే మలిగే భూదేవిపై నీటి సవ్వడి.. వినిపించేను, శ్రీదేవి సిరుల పచ్చని పంటలు పండెను, పరిగెత్తే ప్రయాణికులు పైర గాలితో పరవశించెను నెరజాణ
జతగా.. కలిసి.. అలిసీ..
మేఘమా మరువకే.. వర్షించవే వరుణుడి చంద్రుని ఇంద్రుడా…. కురిపించవా హసన్ పర్తి లోనా. జర్నలిస్ట్ బొజ్జ కృష్ణంరాజు.




