Tuesday, 3 November 2026

నెల్లూరులో మహిళా రక్షక్‌ టీమ్‌ల ఏర్పాటు

నెల్లూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): నెల్లూరు పోలీసులు మంగళవారం ఉదయం మహిళా రక్షక్‌ టీమ్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు పోలీసులు మాట్లాడుతూ.. నెల్లూరులో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై జరిగే నేరాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలో మహిళలపై అనేక నేరాలు పెరుగుతున్న కారణంగానే మహిళా రక్షక్‌ టీమ్స్‌ను ఆవిష్కరించామని తెలిపారు. అమ్మాయిలు, మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో జరుగు నేరాల నిర్మూలన కోసం ఈ టీంను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 10 మహిళా రక్షక్‌ టీమ్స్‌ ఉంటాయని, ప్రతీ టీమ్‌లో ఇద్దరు మగ పోలీసులు, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారని చెప్పారు. ఈ పోలీసులు సాధారణ దుస్తుల్లోనే తిరుగుతూ నిఘా కెమెరాలతో సంఘటనలు నమోదు చేస్తారన్నారు. నేరస్తులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇస్తామని, అవసరమైతే వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్‌, మేజర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ 100 నెంబర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ద్వారా ఫిర్యాదులను మెయిల్‌ చేయవచ్చని పేర్కొన్నారు. 9390777727 నెంబర్‌ను పబ్లిక్‌ ఐ పేరుతో ఉంచామని, దీని ద్వారా ఫిర్యాదులను వాట్సాప్‌ పెట్టవచ్చునని తెలిపారు.