నెల్లూరులో 2న వంచనకు వ్యతిరేక దీక్ష: బొత్స

విజయవాడ,మే28( జ‌నం సాక్షి ): ఎపిలో జూన్‌ రెండున టిడిపి ప్రబుత్వం చేపడుతున్న నవనిర్మాణ దీక్షకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరులో కేంద్ర,రాష్ట్రాల  వంచనకు వ్యతిరేకంగా దీక్షను చేపడుతోంది.సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం కలసి  ఎపి ప్రజలను వంచించాయని అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో రెండు ప్రభుత్వాలు మోసం చేశాయని ,దానికి నిరసనగా తమ ఎంపిలు రాజీనామా చేశారని,వాటిని ఆమోదించుకోవడానికి డిల్లీకి తమ పార్టీ ఎమ్‌.పిలు వెళుతున్నారని బొత్స చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారం ఎట్టి పరిస్తితిలోను రాజీనామాలను ఆమోదిచాలని కోరుతున్నామని ఆయన అన్నారు.