పనాజీ : సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పనాజీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర గురించి కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. మరోవైపు నిన్న జరిగిన పదాధాకారుల భేటీకి అగ్రనేత అద్వానీ గైర్హాజరయ్యారు. నేటి నుంచి జరిగే కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన రాకపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల ప్రచార బాధ్యతలు మోడీకి అప్పగించటాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ… తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసమే శుక్రవారం భేటీకి రాలేదని భాజపా వర్గాలు భావిస్తున్నాయి.




