పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండలో పోలీసులు ఈ ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో 20 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం సానుభూతిపరులకు స్థానిక పాఠశాల కౌన్సెలింగ్ నిర్వహించారు. శివారు గ్రామమైన వేమగిరిలో కూడా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనఖీల్లో 120 మంది పోలీసులు పాల్గొన్నారు.




