Wednesday, 4 November 2026

నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్‌ సేవలు

8xxhjzod

ఢిల్లీ: నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి… దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇక నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ వినియోగదారులు రెండు, మూడు సిమ్‌కార్డులు… సెల్‌ఫోన్లు పట్టుకొని తిరగాల్సిన పనిలేదు. ఎలాంటి దిగులు, ఛార్జీలు లేకుండానే ఇన్‌కమింగ్‌ ఫోన్‌కాల్స్‌ ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఒకదేశం, ఒకనంబర్‌ అనేది బీఎస్‌ఎన్‌ఎల్‌ కల. అది నిజమవ్వబోతోందని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *