Tuesday, 3 November 2026

నేటి నుంచి సభాపర్వం

అవిశ్వాసానికి సిద్ధమవుతున్న విపక్షాలు
దీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు యత్నాలు
హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) :
రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 22 వరకు మొదటి విడత, నెల రోజుల విరామం తరువాత ఏప్రిల్‌ 23 నుంచి మే 2వ తేదీ వరకు జరగుతాయి. సెలవులు పోను బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేది 16 రోజులే. కరెంట్‌ కోతల నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లతో ఉలిక్కిపడిన రాజధానికి పొంచి ఉన్న ఉగ్రవాదం ముప్పు, గుక్కెడు నీటి కోసం సామన్యుడుపడే కన్నీటి కష్టాలు ఇలా పలు సమస్యలపై చర్చించాలనే విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ సమాయ త్తమవుతోంది. టీడీపీ ఈ తీర్మాణానికి అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా అనే అను మానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు శాసనసభలు సజావుగా సాగడం లేదు. 12వ శాసనసభ కాలంలో సభ్యులు రెండున్నర వేల ప్రశ్నలు సంధిస్తే సభాముఖంగా దక్కిన సమాధానాలు వెయ్యి కన్న నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ బ్లాక్‌వాయిస్‌ ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, విషతుల్యమైన నల్గొండ భూగర్భ జలాల వల్ల లక్షలాది మంది వికలాంగులా మారడంతో కలత చెందిన సత్యనారాయణ బ్యాంక్‌ ఉద్యోగాన్ని వదులుకొని వారికి శుద్ధజలాలు అందించేందుకు అవిశ్రాంత పోరు సలిపారని కొనియాడారు. ప్రజలకు తాగునీరు అందించాల్సిన పాలకులు నిమ్మకు నీరిత్తినట్లుగా వ్యవహరిస్తుంటే వారి బాధ్యతను గుర్తు చేసేందుకు ఎన్నో పోరాటాలు సాగించి జైలుకు సైతం వెళ్లారని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ నుంచి నల్గొండ జిల్లాలోని 900 గ్రామాలకు తాగునీరు అందించాలని ఆయన సాగించిన పోరాటం ప్రస్తుత తెలంగాణ సాధన ఉద్యమానికి దిక్సూచీ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పడకపోతే ఈ ప్రాంతం మొత్తం ఎడారిలా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తేనే నల్గొండకు ఫ్లోరైడ్‌ పీడ విరగడవుతుందని, సీమాంధ్రుల పాలనలో రేపటితరం ఇంకా కష్టాలు ఎదుర్కోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. సత్సనారాయణలాంటి నిఖార్సయిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కోసం తన భవిష్యత్‌ను, జీవితాన్ని వదలుకొని ఆయన సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సత్యనారాయణ జన్మదినం సందర్భంగా కేసీఆర్‌ ప్రత్యేకంగా కేక్‌ తెప్పించి కట్‌ చేయించారు. సత్యనారాయణ చదివిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం టీవీ సీఈవో కె. రామచంద్రమూర్తి, డాక్టర్‌ పి. వినయ్‌కుమార్‌, స్వామిగౌడ్‌, డాక్టర్‌ సూరేపల్లి సుజాత, విద్యాసాగర్‌రావు, వేనపల్లి పాండురంగరావు, విరాహత, డాక్టర్‌ చెరకు సుధాకర్‌, వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *