Wednesday, 4 November 2026

నేటి నుంచి సీపీఎం 21వ జాతీయ మహాసభలు

విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. ఎర్ర జెండాల రెపరెపలతో పోర్టు సీటీ పోరు సీటీగా మారింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గోనేందుకు సీపీఎం అతిరథ మహాశయులంతా విశాఖకు చేరుకున్నారు. సమావేశాల్లో గతాన్ని అవలోకనం చేసుకుని… భవిష్యత్తు ఉద్యమ కార్యచరణను రూపొందించనున్నారు కామ్రేడ్లు. సమర్ ముఖర్జీ వేదికగా నామకరణం చేశారు. మొదటగా సీపీఎం బెంగాల్ మాజీ మంత్రి మహ్మద్ సమీన్ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరు స్థూపం వద్ద ప్రతినిధులు నివాళులు అర్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *