నేడు కరువు నిధుల మంజూరు

అనంతపురం,జూలై10(జ‌నం సాక్షి ): అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో కరువు నిధుల మంజూరు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నామని టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు సవిత తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ… కేంద్రం మోసంపై ఎంపిల ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా పెనుకొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బికె.పార్థసారథి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.