Tuesday, 3 November 2026

నేడు చిలుకూరు శ్రీవారి కల్యాణం..

rcs134uhచిలుకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని ఈ రోజు రాత్రి నిర్వహించనున్నారు. గోవింద నామస్మరణలతో పల్లకిలో స్వామివారి ఊరేగింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ మేరకు గర్భగుడి వెనుక భాగంలో అద్దాల మహల్ ముందు కల్యాణ మండపాన్ని రంగురంగు పూలతో అలంకరించారు. ముందుగా సూర్యప్రభ, గరుడ వాహనంలో స్వామి వారిని ఊరేగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *