Thursday, 5 November 2026

నేడు టిజెఎస్‌ అభ్యర్థుల ప్రకటన: కోదండరామ్‌

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అభ్యర్థులను మంగళవారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో తాము పోటీ చేసే అవకాశముందని స్పష్టం చేశారు. మహాకూటమిలోని అందరిని కలుపుకొని టీజేఎస్‌ పోటీ చేస్తుందని, సీపీఐని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రజా, తెలంగాణ ఉద్యమాల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కామన్‌ గుర్తుపై కాకుండా తమ పార్టీ గుర్తు అయిన ‘అగ్గిపెట్టె’పైనే పోటీ చేస్తామని చెప్పారు.