Wednesday, 4 November 2026

నేడు టీఆర్ఎస్ఎల్సీ సమావేశం

93rolocwటీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్ లో జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్‌.. సభ జరిగిన తీరు, తదితర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో ఉదయం 11.30 కు మీటింగ్ ప్రారంభం అవుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులందరికీ సమాచారం చేరవేశారు. అటు మధ్యాహ్న భోజనాలకు ఏర్పాట్లు చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ జరిగిన తీరు, ప్రతిపక్షాల వ్యవహార శైలిపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన అన్ని విషయాలపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్చ నిర్వహించేందుకు.. రెండు రోజులపాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని సైతం రద్దు చేసింది. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు 15 నెలల కాలంలో చేపట్టిన చర్యల్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించామని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో మునుపెన్నడు లేని రీతిలో అర్థవంతమైన చర్చ జరిగిందనే భావన కూడా ఉంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం అనవసరంగా రాద్దాంతం చేశాయి. అలవిగాని డిమాండ్లతో సభ జరుగకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాయి. ఆ తర్వాత సభ నుంచి పంపించారంటూ బయట ప్రచారం మొదలెట్టాయి. సభలో రచ్చ చేస్తే ఎలాగూ సస్పెండ్ చేస్తారని ఉద్దేశ్యపూర్వకంగా అలాంటి పరిస్థితులు కల్పించారనేది వాస్తవం. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ సమావేశంలో సూచించే అవకాశం ఉంది.అటు అసెంబ్లీ సమావేశాలు ముగిసినందున నేతలంతా ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 15 నెలలుగా రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కేటాయించిన నిధులు.. సమస్త వివరాల్ని ప్రజల ముందుంచాలని చెప్పే అవకాశం ఉందన్నారు. 60 యేండ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పాపాల ఫలితంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉందని చెప్తున్నారు.వాటర్ గ్రిడ్‌, మిషన్ కాకతీయ పనుల్లో ప్రజాప్రతినిధులు సంపూర్ణంగా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి సమావేశంలో పార్టీశ్రేణులకు సూచించే అవకాశం ఉంది. ఈ రెండు పథకాల కింద జరిగే పనులను దగ్గరుండి చేయించుకోవాలని, దాంతో ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయని చెప్పనున్నట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రీ డిజైనింగ్‌, సమగ్ర జలవిధానంపైన ప్రభుత్వ వ్యూహాన్ని ప్రజాప్రతినిధులకు వివరిస్తారని తెలిసింది. అటు ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్షానికి అందరూ హాజరై అవగాహన పెంచుకోవాలని సూచించే అవకాశం ఉంది.నామినేటెడ్ పదవులపైనా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ విషయంపై ప్రస్తావించిన సీఎం.. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నామినేటెడ్ పదవలు భర్తీ ప్రక్రియ వేగవంతం చేద్దామని చెప్పారు. మార్కెట్ కమిటీ ఛైర్మెన్లు, దేవాదాయ కమిటీలు దసరాలోపు పూర్తి చేయాలనే రీతిలో టైం బౌండ్ కార్యక్రమాన్ని సూచించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలతోపాటు రాష్ట్రస్థాయిలో అనుబంధ సంఘాల్నీ ఏర్పాటు చేసుకోవడంపై ప్రణాళిక వివరించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే వరంగల్ పార్లమెంటు, నారాయణ్ ఖేడ్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల అంశాల్ని కూడా ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న గవర్నర్ నరసింహన్ తో నిన్న సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సభ జరిగిన తీరు, సాగునీటి ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం, కరువు మండలాల వ్యవహారం, తదితర అంశాలను గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *