Tuesday, 3 November 2026

నేడు నగరంలో ..ప్లేఓవర్ల నిర్మాణానికి గడ్కరీ శంకుస్థాపన

– హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్డు
– శరవేగంగా జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి
– విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్‌, మే4(జ‌నం సాక్షి ): ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ప్లే ఓవర్లతో పాటు ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు శుక్రవారం ఆయన సచివాలయంలో విూడియాతో మాట్లాడారు. అంబర్‌పేట్‌ కూడలి వద్ద రూ. 186.71 కోట్లతో 1.4 కిలోవిూటర్ల మేర నాలుగు లేన్ల ప్లే ఓవర్‌, ఉప్పల్‌ నుంచి పవర్‌ గ్రిడ్‌ వరకు రూ. 626 కోట్లతో 6.25 కి.విూ. ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌, రాష్ట్ర నిధులతో ఉప్పల్‌ కూడలి నుంచి స్టేడియం వరకు రూ. 311 కోట్లతో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో పాటు ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వరకు రూ. 283.15 కోట్లతో 10 కిలోవిూటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. హైదరాబాద్‌ చుట్టూ రూ. 7500 కోట్లతో 337 కిలోవిూటర్ల మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించనున్నామని మంత్రి పేర్కొన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మెదక్‌ వరకు 426.52 కోట్లతో 67 కిలోవిూటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు