Friday, 6 November 2026

నేడు భారత్‌, పాక్‌ సమరం

బర్మింగ్‌హవమ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్టు నేడు తలపడనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభ కానుంది. ఇప్పటికే సెమీన్‌కు చేరుకున్న భారత్‌ అఖరి మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానంలో నిలిచేందుకు తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తమ అభిమానులను సంతోషపెట్టాలని పాకిస్థాన్‌ పట్టుదలతో ఉంది. భారత్‌ ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ వరుసుగా మూడో సెంచరీ చేస్తే ఈ ఘనత సాధించిన మొదటి భారత బ్యాట్స్‌మెస్‌ అవుతాడు. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌ చూసేందుకు ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *