నేడు మాధవరానికి ఎమ్మెల్యే రాక

మునగాల మండలం మాధవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నేతలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.