Thursday, 5 November 2026

నేడు రైతులకు నేల దినోత్సవ అవగాహన కార్యక్రమం

ప్రపంచ మృత్తికా (నేల) దినోత్సవం సందర్భంగా మునగాల  మండలంలోని అన్ని రైతువేదికలో రైతులకు ఉదయం 10.00 గంటలకు అవగాహన కార్యక్రమం కలదని మునగాల మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలని కాపాడుకొని నేలసారం దెబ్బ తినకుండా అధిక దిగుబడులు ఎలా సాధించాలనే అంశంపై వ్యవసాయ అధికారులు తెలియచేస్తారన్నారు. మండలంలో ఉన్న మునగాల, ఆకుపాముల, నేలమర్రి, రేపాల రైతువేదికలలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. కావున రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.