Wednesday, 4 November 2026

నేడే తొలి నోటిఫికేషన్..

nqhk8fpfహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు నేరవేరనున్నాయి. నేడు ఇంజినీర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. సాయంత్రం 5గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీష్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇంజినీరింగ్ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వివిధ విభాగాల కింద మొత్తం 1700 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. ఇందుకు బీటెక్ విద్యార్హతగా విధించారు. పోస్టుల భర్తీలో పదేళ్ల గరిష్ట వయో పరిమితిని కమిషన్ అమలు చేయనుంది. ఇవే కాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూఎస్)లో 756 పోస్టులను ఓట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు ఆ శాఖ ఇంజినీర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *