పెన్షన్ తదతర అంశాలపై స్పష్టత
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): నేవీలో పదేండ్లు పనిచేసి, పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు శుభవార్త. ఇన్నాళ్లు పింఛన్ లేకుండా అవస్థలు పడుతున్నవారికి ఊరట లభించనున్నది.
నేవీలో రిక్రూట్ చేసుకున్నవారిని 10 ఏండ్ల పాటు రెగ్యులర్ సర్వీస్, మరో ఐదేండ్ల పాటు రిజర్వ్ సర్వీస్ ఉంచుతామని విధుల్లోకి తీసుకున్నారు. కాని 10 ఏండ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తికాగానే, రిజర్వ్ సర్వీస్ తీసుకో కుండానే వారిని బలవంతంగా పంపించివేశారు. మరో ఐదేండ్ల రిజర్వ్ సర్వీసు పూర్తిచేసుకున్న సైనికులు మాత్రమే స్పెషల్ పింఛన్ అర్హులు. కాని అకారణంగా, ఆకస్మాత్తుగా వారిని విధుల్లో నుంచి తొలగిం చడంతో వారంతా పింఛన్ నోచుకోకుండానే పదవీ విరమణ పొందారు. నేవీ వర్గాల చర్యలతో నష్ట పోయినవారంతా తమకు స్పెషల్ పింఛన్ వర్తింపజేయాలంటూ ఆర్మీ ఫోర్సెస్ ట్రిబ్యునల్ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులు కూడా స్పెషల్ పింఛన్ ఇవ్వాల్సిందేనంటూ సమర్ధించాయి. ఈ మేరకు ట్రిబ్యునల్ తీర్పును అనుసరించాల్సిందేనంటూ 2016 అక్టోబర్ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో స్పెషల్ పింఛన్ అందించేందుకు సైనిక సంక్షేమశాఖ అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంప్రదించి దర ఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సైనిక సంక్షేమశాఖాధికారి నోరి శ్రీనేష్ తెలిపారు. ఇతర వివరాల కోసం 87907 38657 నెంబర్ సంప్రదించాలన్నారు.




