Tuesday, 3 November 2026

నౌషిన్‌ కేసులో కొత్త మలుపు

మెదక్‌: మెదక్‌ జిల్లా కొండాపూర్‌మండలం మల్కాపూర్‌లో ఇటీవల మరణించిన బాలిక నౌషిన్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. నౌషిన్‌ తమ కుమార్తె అని హైదరాబాద్‌కు చెందిన గౌసుమొయినుద్దీన్‌ పోలీసులను ఆశ్రయించాడు. పత్రికల్లో వచ్చిన ఫొటోలను చూసి తన కుమార్తెను గుర్తించామని ఆయన పోలీసులకు తెలిపాడు. జూలై 31న గుల్బర్గా జాతరలో నౌషిన్‌ తప్పి పోయిందని పాప పాత ఫొటోలు, ఇతర ఆధారాలను ఆయన పోలీసులకు చూపించాడు. ఓ కానిస్టేబుల్‌ కుటుంబం నౌషిన్‌ను తీసుకు వచ్చి చిత్రహింసలకు గురి చేయడంతో ఇటీవల ఆస్పత్రిలో బాలిక మరణించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *