Tuesday, 3 November 2026

6 రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు: ద.మ.రైల్వే

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి బయలుదేరే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విశాఖ, మచిలీపట్నం, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 5వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ తాత్కాలిక అదనపు బోగీల సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ఈ అదనపు బోగీల వల్ల 4752 బెర్తులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *