ఎమ్మెల్యేల కేసులో టిఆర్‌ఎస్‌కు కనువిప్పు కావాలి
స్పీకర్ తక్షణమే వారి సభ్యత్వాలు పునరుద్దరించాలి
పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి): న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ విశ్వాసం ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్‌ంరెస్ ఎమ్మెల్యేలపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను మైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల సబ్యత్వాలను పునరుద్దరించి అధికార పార్టీ కోర్టు తీర్పును గౌరవించాలన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించి ఎంఎల్‌ఎల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం వ్యవస్థలపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల ఎమ్యెల్యేల పదవులను పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టులో వారికి ఊరట లభించింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లాగా నిర్వహించడం సరికాదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే వరకూ కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.ప్రధాని మోదీని గ్దదె దించాలంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ ప్రధాని అయితేనే అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. మజ్లిస్, టీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే.. బీజేపీని బలపరిచినట్లేనని అన్నారు. సీఎం కేసీఆర్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ప్రధాని మోదీకి చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేయడం తప్ప.. చేసిందేవిూ లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి కాంగ్రెస్ బలోపేతానికి బాటలు వేస్తామన్నారు. ప్రధాని మోదీ.. పెట్రో, గ్యాస్ ధరలను భారీగా పెంచి సామాన్యుల బతుకులను దుర్భరం చేశారని ఆరోపించారు.




