కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లకు మరోమారు ఊరట
ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై పిటిషన్ విచారణార్హం కాదని తీర్పు
తీర్పును స్వాగతించిన కాంగ్రెస్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి): అధికార టిఆర్‌ఎస్‌కు మరోమారు భంగపాటు తప్పలేదు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కు హైకోర్టులో మరో భారీ ఊరట లభించింది. వారి ఎమ్మెల్యలే సభ్యత్వాన్ని రద్దును తప్పుపడుతూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అప్పీల్ చేయగా హైకోర్టు కొట్టేసింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభత్వాలు రద్దు చేస్తూ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం వాళ్లు హైకోర్టులో అప్పీల్ చేయడంతో అసెంబ్లీ నుంచి వెంకట్ రెడ్డి, సంపత్ ను బహిష్కరించిన కేసులో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు వారి ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కూడా ఆదేశించింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెరాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల కేసులో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను శాసనసభ నుంచి బహిష్కరణ చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వగా, దానిని వ్యతిరేకిస్తూ పన్నెండు మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ చేశారు. తమ వాదన కూడా వినాలని వారు కోర్టును కోరారు. వారిని బహిష్కరించడంలో తమకు భాగస్వామ్యం ఉందని వారు వాదించారు. అయితే హైకోర్టు వీరి వాదనను ఒప్పుకోలేదు. కోమటిరెడ్డి, సంపత్ ల కేసులో అప్పీల్ చేయదలిస్తే ప్రభుత్వం లేదా, అసెంబ్లీ కార్యదర్శి మాత్రమే చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట లబించినట్లయింది. వారికి ఎమ్మెల్యేల సదుపాయాలను పునరుద్దరించాలని అది చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుందని న్యాయవాది జంద్యాల రవిశంకర్ చెప్పారు.తెరాస పిటిషన్ విచారణార్హంపై వేసవి సెలవుల ముందు వాదనలు విన్న ధర్మాసనం.. సోమవారం తీర్పునిచ్చింది.తెలంగాణ శాసనసభ బ్జడెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలి గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి రెండు జీవోలను కూడా విడుదల చేసింది. దీనిపై హైకోర్టు తలుపుతట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లపై విధించిన నిషేధం చెల్లదని.. వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరిం చాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ 12 మంది తెరాస ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభలో ఆ ఘటన చోటుచేసుకున్న సమయంలో తాము సభలోనే ఉన్నామని.. కావున తమ వాంగూల్మాలను పరిగణనలోకి తీసుకుని వారిపై నిషేధాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెరాస ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ పిటిషన్ విచారణార్హంపై హైకోర్టు వాదనలు వింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, తెరాస ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఈకేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. తెరాస ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. తెరాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.
———–




