పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి ..కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

అల్వాల్ (జనంసాక్షి)జూన్ 3
పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా నాలుగవ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ సాయి నగర్ కాలనీ రాజీవ్ వికర్ సెక్షన్ కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి తో కలిసి కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పట్టణాలు పరిశుభ్రత తో కళకళలాడుతూ ప్రణాళిక అభివృద్ధి ధ్యేయంగా మరో దఫా పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరో పదిహేను రోజుల పాటు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ అధికారులు ఏఎంసి హేమలత, ఈ లక్ష్మి, ఎంటమాలజీ ఏఈ అనిల్, జలమండలి అధికారులు మల్లికార్జున్, శానిటేషన్ సిబ్బంది టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు రాపర్తి చంద్రశేఖర్, కిషోర్, మధుమతి, కవిత, బబిత, గాయత్రి, జ్యోతి, అరవింద్, విశాల్, లోకేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.