దిల్లీ: పటియాల హౌస్ న్యాయస్థానం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌ను న్యాయస్థానంలో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా న్యాయవాదులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం శ్రుతిమించి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తమపైనా కొందరు దాడికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి కోర్టు ప్రాంగణంలోనే పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ ఘటనలతో న్యాయస్థానం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.