*పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ రావు*
పెబ్బేరు జూన్ 9 ( జనంసాక్షి ): వ పట్టణ ప్రగతి లో భాగంగా పెబ్బేరు పురపాలక సంఘం లో జరుగుతున్న పనులను స్పెషల్ ఆఫీసర్, సి డి ఎం ఏ , హైదరాబాద్, శ్రీ పాద రామేశ్వర్ రావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.అందులో భాగంగా వేజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ (ఇంటరీ గ్రేటరి మార్కేట్) పనులను, అంబేద్కర్ పార్క్ పనులను, కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, ట్రీ పార్కులను మరియు అవెన్యూ ప్లాంటేషన్ పనులను పర్యవేక్షణ చేశారు. జరుచున్న పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్ గల స్పెషల్ ఆఫీసర్ కి వివరించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ శ్రీ సాయినాథ్ , 3వ వార్డు కౌన్సిలర్ పార్వతిదేవి, 4వ వార్డు కౌన్సిలర్ సువర్ణ , స్యానిటరి ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యోగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.