పట్టణ ప్రగతి లో భాగంగా కార్పొరేటర్ పాదయాత్ర
నాచారం(జనంసాక్షి): పట్టణ ప్రగతి లో భాగంగా అన్నపూర్ణ కాలనీ, రాఘవేంద్ర నగర్ పార్ట్ లలో బుధవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ పాదయాత్ర నిర్వహించి శానిటేషన్ , మంచినీటి , మురుగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడం జరిగింది . అలాగే రోడ్లు, డ్రైనేజీలు కొత్త మంచినీటి పైపులైన్ లకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది . మరీ ముఖ్యంగా అన్నపూర్ణ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు తయారు చేయవలసిందిగా అధికారులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎంసి సురేందర్ , ఏ.ఈ దయ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు విఠల్ యాదవ్ ,డివిజన్ అధ్యక్షులు ముత్యంరెడ్డి, సాయి జెన్ శేఖర్, రవీందర్ రెడ్డి, సంఘం యాదగిరి ,దేవులపల్లి యాదగిరి, రాజబాబు, పాండు తదితరులు పాల్గొన్నారు.