*పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు స్థల పరిశీలన*
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోదాడ లో నూతన భవన నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం
కోదాడ పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించి ఆమోదాన్ని పొందిన తర్వాత శాశ్వత భవనం నిర్మాణం కొరకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఈ సందర్భంగా సిబ్బందిని కోరారు. వీరి వెంట కోదాడ మున్సిపల్ కమిషనర్ , డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ నిరంజన్, జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డెమో అంజయ్య , డాక్టర్ విజయ్ కుమార్,డాక్టర్ శైలజ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్ రాజు, ముక్కా శ్రీనివాస్ , మునిసిపాలిటీ సిబ్బంది ఉన్నారు.