పట్టపగలే మహిళా న్యాయవాది హత్య

చిత్తూరు,మే30(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా మదనప్లలెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి, న్యాయవాది నాగజ్యోతిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. స్కూటీపై వెళుతున్న ఆమెపై కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.