బెంగుళూరు: కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డీ-8 బోగీ పూర్తిగా దెబ్బతినట్లు తెలుస్తోంది. పట్టాలపై ఉన్న పెద్ద బండరాయిని ఢీకొట్టడంతో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో దాని వెనుక ఉన్న బోగీలన్నీ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అసలు బండరాయి రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల నిమిత్తం అక్కడికి తరలించారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురు ప్రయాణీకులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో పాటు, న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఘటనాస్ధలికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రైలు పట్టాలు తప్పడంతో బెంగుళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పట్టాలు తప్పిన రైలు: 10 మంది మృతి.. బండరాయిని గుద్దుకోవడం వల్లే..?