పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరు
కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల
గంగాపూజల నిర్వహించి విడుదల చేసిన చంద్రబాబు
అడుగడుగునా పట్టిసీమకు అడ్డంకులు సృష్టించారని మండిపాటు
పోలవరాన్ని అడ్డుకున్నా పూర్తి చేస్తున్నామని వెల్లడి
విజయవాడ,జూన్20(జనం సాక్షి ): పట్టిసీమను నిర్మించే సమయంలోనూ ఆ తరవాత కూడా కొందరు దుష్పచ్రారం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇవాళ పట్కటిసీమే కషృ/-ణాడెల్టాకు ప్రాణప్రదంగా మారిందని అన్నారు. బుధవారం తూర్పు డెల్టా స్లూయిస్ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు సీఎం నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు అడగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టారన్నారు. వాటన్నింటినీ అధిగమించి, అందరినీ ఒప్పించి పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరం పనులు 56 శాతం పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నీరు విడుదల చేస్తూ గంగాహారలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన సభాపతి మండలి బుద్దప్రసాద్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువపై కొత్తగా నిర్మించిన నియంత్రిక ద్వారా సీఎం నీరు విడుదల చేసారు. దీనిద్వారా రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. కృష్ణా కాలువలో ముఖ్యమంత్రి గంగపూజ నిర్వహించారు. గతేడాది కంటే వారం రోజుల ముందే కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కృష్ణా తూర్పుడెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పశ్చిమ డెల్టా కాలువకు మరో రెండు రోజుల తర్వాత సాగునీరు విడుదల చేయనున్నారు. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది జీరో అవుట్ ఎ/ాలో ఉందని.. చరిత్రలో ఇలాంటి దారుణమైన పరిస్థితి తొలిసారని సీఎం వ్యాఖ్యానించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నది ద్వారా బ్యారేజీకి నీరు రావడం లేదన్నారు. కృష్ణా నదిపై ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు పెరిగి కిందకు నీరు వచ్చే పరిస్థితి లేదని కొన్నేళ్లుగా కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి ఎదురైందని.. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఈ సమస్య అధిగమించామన్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో కాలువలకు నీరిస్తున్నామని… ముందుగా నీటి విడుదల వల్ల తుఫానులు రాకముందే పంట చేతికొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నీరు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని.. అభివృద్ధి ఫలాలు అందుకున్న వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోనే నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.