Tuesday, 3 November 2026

పఠాన్‌కోట్‌పై ఉగ్రపంజా

C

– 5 గురు మిలిటెంట్ల హతం, ముగ్గురు జవాన్ల మృతి

– సమర్ధవంతంగా తిప్పికొట్టాం

– రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): దేశంపై ఉగ్రవాదులు మరోమారు పంజా విసిరారు. పంజాబ్‌లో మరో సారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్‌ వాహనంలో వచ్చిన 5 ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించి ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ఇద్దరు వైమానిక స్థావరంలోకి ప్రవేశించారు. భద్రతా బలగాలు వేటాడి మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. దాడులకు పాల్పడింది జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఆరునెలల వ్యవధిలో ఇక్కడే ఇది రెండో దాడి. దీంతో దేశంలో హై అలర్ట్‌ ప్రకటించారు. వైమానిక స్థావరం ధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం అపహరించిన వాహనంలోనే ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించారు. ఈ దాడితో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు జరిపారు. పఠాన్‌కోట్‌లో శుక్రవారం  గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ కారులో వెళ్తుండగా సాయుధులు అపహరించారు. ఎస్పీ అపహరణ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధముందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రదాడుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.  ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన వారిలో డిఫెన్స్‌ సర్వీస్‌ కోర్‌కు చెందిన మరో జవాన్‌ చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఉగ్రదాడిని తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందిన వారికి సంఖ్య మూడుకు చేరింది. దీంతో దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.  అయితే ఇటు ఎన్‌కౌంటర్‌ ముగిసిందని ప్రకటించిన వెంటనే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రికత్తను రాజేసింది. దీంతో అధికారులు స్వాట్‌ బృందాన్ని ఘటనా స్థలానికి  తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. పంజాబ్లోని కీలకమైన  ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది.  తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు పంజాబ్‌ అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌లోకి శనివారం ఉదయం ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్‌ వాహనంలో వచ్చిన నలుగురు ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారని, దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఇద్దరు వైమానిక సిబ్బంది అమరులయ్యారు.  ఉగ్రవాదులు ఎవరు దాడి చేసినా వాటికి గట్టిగా బదులిస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం పాకిస్థాన్‌తో శాంతి కోరుకుంటున్నామని, ఉగ్రవాదులు ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా తిప్పికొడుతామని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల ప్రయత్నాలను భగ్నం చేసిన పంజాబ్‌ పోలీసులపై రాజ్‌నాథ్‌ ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదులను తిప్పికొట్టిన తీరును ఆయన మెచ్చుకున్నారు. జవాన్లు కనబరిచిన ధైర్యసాహసాల పట్ల గర్వంగా ఉందన్నారు.  పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఉన్నతస్థాయి సవిూక్షను చేపట్టారు. ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ హాజరయ్యారు. మరోవైపు  పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదుల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో టెర్రరిస్టులకు లింకున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన కారులో జైషే మొహ్మద్‌ లేఖను పోలీసులు గుర్తించారు. జైషే మొహ్మద్‌ అని రాసి ఉన్న ఓ కాయితాన్ని కారు డ్రైవర్‌ జేబులోంచి స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఆ డ్రైవర్‌ మృతిచెందాడు. ఉగ్రదాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు, మరో నలుగురు జవాన్లు మృతిచెందారు. పంజాబ్‌ పోలీసులు ప్రకారం మరో ఉగ్రవాది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6నెలల వ్యవధిలో ఇది రెండో సారి. జులై 27న గురుదాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు అమరులయ్యారు. భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టడంతో ఆపరేషన్‌ ముగిసింది. పంజాబ్‌లో వరుస ఉగ్రదాడులు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *